
విశాఖలో CII సమ్మిట్.. హాజరైన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (వీడియో)
AP: విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సదస్సుకు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మతో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సీఎస్ విజయానంద్, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీలు హాజరయ్యారు.




