తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఘాట్‌రోడ్డులో వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు అకస్మాత్తుగా ఊడిపోగా డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో భక్తులు పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆర్టీసీకి చెందిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణికులతో వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందు టైరు ఊడిపోవడంతో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.