ఒకరికి ఎక్కించాల్సిన రక్తం మరొకరికి ఎక్కించడంతో వ్యక్తి మృతి

32049చూసినవారు
ఒకరికి ఎక్కించాల్సిన రక్తం మరొకరికి ఎక్కించడంతో వ్యక్తి మృతి
రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో అక్టోబర్ 11న వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 50 ఏళ్ల రోగి మంగీలాల్ మరణించాడు. ఆసుపత్రిలో ఒకే పేరుతో ఇద్దరు ఉన్నారు. అయితే 80 ఏళ్ల మంగీలాల్‌కు రక్త మార్పిడి అవసరం కాగా అతనికి ఎక్కించాల్సిన రక్తం తేనెటీగ కుట్టడంతో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల మంగీలాల్‌కు రక్తం ఎక్కించారు. సగం కంటే ఎక్కువ ఎక్కించిన తర్వాత ఈ పొరపాటు బయటపడింది. దీపావళి రోజున మరణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్