
ఒంటరి వ్యక్తుల కోసం యాప్.. చైనాలో ఫుల్ వైరల్
చైనాలో 'ఆర్ యూ డెడ్' అనే యాప్ విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఒంటరిగా జీవించే వారి కోసం రూపొందించిన ఈ యాప్, రెండు రోజులకు ఒకసారి చెక్-ఇన్ చేయని వారిని గుర్తించి, అత్యవసర కాంటాక్ట్‌లకు సమాచారం అందిస్తుంది. చైనాలో సుమారు 20 కోట్ల మంది ఒంటరిగా జీవిస్తున్నారని అంచనా. ఈ యాప్‌ను 'డెముమూ' పేరుతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చైనీస్ పట్టణాల్లో ఒంటరిగా నివసించే వారు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఇది అత్యధికంగా డౌన్లోడ్ అయిన పెయిడ్ యాప్‌గా నిలిచింది.




