సహాయక చర్యల్లో నిర్లక్ష్యం.. స్ట్రెచర్‌పై నుంచి కింద పడ్డ క్షతగాత్రులు (వీడియో)

39చూసినవారు
TG: వికారాబాద్‌ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో నిర్లక్ష్యం కనిపించింది. కాలం చెల్లిన, తుప్పుపట్టిన స్ట్రెచర్‌పై క్షతగాత్రులను తరలించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో క్షతగాత్రులు స్ట్రెచర్‌పై నుంచి కిందపడ్డారు. వీల్‌చైర్లు అందుబాటులో లేక మరికొందరు తీవ్ర గాయాలతో నడుచుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరతపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

సంబంధిత పోస్ట్