
చెఫ్ వికాస్ ఖన్నాకు రాఖీ కట్టిన రాధికా మర్చంట్ (వీడియో)
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు జరుగుతుండగా, అంబానీ కుటుంబం న్యూయార్క్లో ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్లో ఘనంగా జరుపుకుంది. రాధికా అంబానీ, చెఫ్ వికాస్ ఖన్నాకు జిలేబీ ఆకారపు రాఖీ కట్టారు. ఈ చర్యతో భావోద్వేగానికి గురైన వికాస్ ఖన్నా, రాధికా చేసిన పనిని ఎన్నటికీ మర్చిపోలేనని, అనంత్ అంబానీ జంతు సంక్షేమ ప్రాజెక్టు 'వంతార'లో చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ అపురూప క్షణాలకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.




