
నేపాల్ వరదలకు కారణం ఇదే.. వైరల్‌గా మారిన డ్రోన్ విజువల్స్
నేపాల్‌లో మెరుపు వరదలకు కారణమైన భారీ మంచు గడ్డ ధ్వంసానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. చైనా ఫోటోగ్రాఫర్ డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, సముద్ర మట్టానికి 7,200 మీటర్ల ఎత్తులో ఉన్న లాంగ్తాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం వద్ద భారీ మంచు గడ్డ విరిగి లోయలోకి పడిపోయింది. దీంతో భోటెకోశీ, త్రిశూలి నదులు ఉప్పొంగి మెరుపు వరదలు సంభవించాయి. ఆగస్టు 26న సంభవించిన ఈ వరదల వల్ల నేపాల్‌లో 903 మంది, టిబెట్‌లో 16 మంది మరణించారు, 4,500 మంది ఆచూకీ లభించలేదు.




