నేపాల్‌లో వరదల విధ్వంసంతో మరణాల సంఖ్య 1,222కి చేరింది. వారం రోజులైనా ఇంకా 4,000 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. వీరిలో 583 మంది విదేశీయులే ఉన్నట్లు తెలుస్తోంది. 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 20,000 మందికి పైగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. భారీగా బురద పేరుకుపోవడంతో రెస్క్యూ కార్యకలాపాలు కష్టంగా మారాయి. టిబెట్‌లోని గిరాంగ్ కౌంటీలో కూడా మరణాలు 21కి చేరగా, 541 మంది తప్పిపోయారని సమాచారం.