నేపాల్లోని నువాకోట్ జిల్లాలో వరదల కారణంగా కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకున్న 97 ఏళ్ల గుణ మాయా బొహారాను ఆర్మీ, పోలీసులు, స్థానికులు 4 గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. వరదల్లో కొట్టుకుపోయిన ఆమె నివసిస్తున్న సంరక్షణ గృహం శిథిలాల కింద సగానికిపైగా కూరుకుపోయిన వృద్ధురాలిని గుర్తించిన సహాయక బృందాలు, పోలీసులు, ఆర్మీ సహాయంతో ఆమెను కాఠ్మండూలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.