ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన సంఘర్షణలో బందీగా ఉన్న నేపాల్ విద్యార్థి బిపిన్ జోషి (23) మృతదేహాన్ని అక్టోబర్ 13న ఇజ్రాయెల్‌కు అప్పగించారు. గాజా సరిహద్దు సమీపంలో కిబ్బుట్జ్ అలుమిమ్‌లో వ్యవసాయ విద్యార్థిగా శిక్షణ పొందుతున్నప్పుడు 2023లో హమాస్ దాడిలో అతను బందీగా చిక్కాడు. అతన్ని ఓ సారి కాపాడే ప్రయత్నంలో గాయపడ్డాడు. ఇతని కుటుంబం కూడా విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఇజ్రాయెల్ డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మృతదేహాన్ని నేపాల్‌కు అప్పగించనుంది.