
శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానం (ఫ్లైట్ నంబర్ 2879) ల్యాండ్ అయిన వెంటనే బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాన్ని మిగతా విమానాలకు దూరంగా తరలించి, ఫైరింజన్లతో చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను, లగేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ విమానంలో పలు పార్టీల రాజకీయ నాయకులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, బీహార్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డి వంటి ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.




