బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

34చూసినవారు
పెళ్లిళ్లు, పండుగలు, ప్రారంభోత్సవాల్లో డప్పుల శబ్దం వాతావరణాన్ని సందడిగా మారుస్తుంది. తాజాగా, డప్పుల దరువుకు ఓ రోబోట్ మనుషుల్లా స్టెప్పులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఈవెంట్ ప్రాంగణంలో, డ్రమ్స్ వాయిస్తుండగా, నీలం, నారింజ టీ-షర్ట్, నల్లటి షార్ట్స్, హెల్మెట్ ధరించిన రోబోట్ ప్రత్యక్షమైంది. డప్పుల శబ్దం మొదలవగానే, ఆ రోబో ప్రతి బీట్‌కు అనుగుణంగా చేతులు, కాళ్లు, నడుము కదుపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్