Top 10 viral news 🔥

గుడ్ న్యూస్.. ఇకపై రైల్వే టికెట్లో తేదీ మార్పు
భారతీయ రైల్వే టికెటింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రయాణికులు తమ ధృవీకరించిన టికెట్‌ను రద్దు చేయకుండానే వేరే రోజుకు మార్చుకోవచ్చు. IRCTC వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సీట్ల లభ్యతను బట్టి కొత్త తేదీ లేదా రైలును ఎంచుకోవచ్చు. అదనపు ఛార్జీలు లేకుండా, ఛార్జీల వ్యత్యాసం (ఏదైనా ఉంటే) మాత్రమే చెల్లించాలి. ఈ కొత్త విధానం ప్రయాణికుల డబ్బు, సమయం ఆదా చేయడంతో టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.




