పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదు: డీకే శివకుమార్

64చూసినవారు
పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదు: డీకే శివకుమార్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం మార్పు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి దక్కించుకోవడానికి విప్లవం అవసరం లేదని, కాలమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పార్టీ కోసం తాను చేస్తున్న కృషి అందరికీ తెలుసని, ఏ సమయంలో తనకు ఏ స్థానం ఇవ్వాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. కర్ణాటక సీఎం మార్పుపై కేంద్ర నాయకత్వం చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలపై తనకు సమాచారం లేదని శివకుమార్ పేర్కొన్నారు. తాను ప్రజల కోసం పోరాడానని, పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్