ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో "ఉత్తమ స్టంట్ డిజైన్" అనే కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టనున్నారు. 2026 నుంచి ఇది అమల్లోకి రానుందని ఆస్కార్ కమిటీ పేర్కొంది. ఈ నిర్ణయం హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టంట్ మాస్టర్ల కృషిని గుర్తించేందుకు తీసుకున్నారు. స్టంట్ మాస్టర్లు చిత్రాల్లో ప్రాణాలతో ఆడుతూ అద్భుతాలు చేస్తున్నా ఇంతవరకు గుర్తింపు లభించలేదనే విమర్శల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నారు.