
డాలర్ విలువ పడిపోతోంది: రాబర్ట్ కియోసాకి
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి డాలర్ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు పెరగడం లేదని, అసలు సమస్య డాలర్ కొనుగోలు శక్తి క్షీణించడమేనని ఆయన పేర్కొన్నారు. 1971 నుంచి అమెరికన్ డాలర్ తన కొనుగోలు శక్తిలో 93% కోల్పోయిందని, ప్రభుత్వాలు కరెన్సీని ముద్రిస్తూనే ఉంటాయని, ఫలితంగా విలువ తగ్గుతుందని ఆయన విమర్శించారు. నిజమైన ఆస్తులైన భూమి, బంగారం, వెండి, చమురు, వ్యాపారాలు తమ విలువను నిలబెట్టుకుంటాయని, డాలర్లు దాచుకోవద్దని, నిజమైన ఆస్తులను సొంతం చేసుకోవాలని సూచించారు.




