
పెళ్లి చేసుకోకపోతే రూ. 29 లక్షలు.. తల్లి వింత ఆఫర్
నలుగురు పిల్లల తల్లి కేట్, తన కూతుళ్లు పెళ్లి చేసుకోకపోతే రూ. 29 లక్షలు ఇస్తానని వింత ఆఫర్ ఇచ్చింది. పెళ్లి పేరుతో అప్పులు చేసి జీవితం మొదలుపెట్టే ఇబ్బంది పిల్లలకు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తన సొంత పెళ్లికి అయిన ఖర్చుల వల్ల అప్పు తీర్చడానికి ఐదేళ్లు కష్టపడాల్సి వచ్చిందని, ఆ డబ్బును భవిష్యత్తు కోసం వాడుకోవాలని కోరుకుంటున్నట్లు కేట్ వివరించింది. అయితే, కూతుళ్లు పెళ్లి చేసుకుంటానంటే ఓకే అంటా అని చెప్పింది.




