ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లను ఆకట్టుకునేందుకు పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. మిస్డ్‌కాల్స్‌కు వాయిస్ మెసేజ్‌లు, ఫన్ స్టిక్కర్లు, మెటా AIతో ఇమేజ్‌లను షార్ట్ వీడియోలుగా రూపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి. చాట్ స్క్రీన్‌లో మిస్డ్ కాల్ దిగువన వాయిస్/వీడియో నోట్ పంపే బటన్ కనిపిస్తుంది. వాయిస్ చాట్ సమయంలో కొత్త రియాక్షన్‌లతో స్పందించే సదుపాయం, వీడియో కాల్స్‌లో మాట్లాడే వ్యక్తికి ఆటోమేటిక్ ప్రాధాన్యం కూడా వస్తాయి.