'శ్రీశైలం డ్యామ్‌కు కొత్త గేట్లు ఏర్పాటు చేయాలి'

11512చూసినవారు
'శ్రీశైలం డ్యామ్‌కు కొత్త గేట్లు ఏర్పాటు చేయాలి'
శ్రీశైలం డ్యామ్‌కు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన.. పదో నంబర్‌ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బందేమీ లేదన్నారు. రేడియల్‌ క్రస్ట్‌ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్‌ వేయాలని సూచించారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.