కొత్త జీఎస్టీ ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన రైల్వే (VIDEO)

33900చూసినవారు
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. జీఎస్టీ సంస్కరణలతో రైల్ నీర్‌ ధరలు తగ్గాయి. ఇకపై 1 లీటర్ బాటిల్ రూ.15కి బదులు రూ.14, 500 మి.లీ. బాటిల్ రూ.10కి బదులు రూ.9కే లభించనుంది. ఈ మార్పు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. అలాగే ప్యాకేజ్డ్ స్నాక్స్, బిస్కెట్లు, జ్యూస్‌లపై కూడా జీఎస్టీ 12% నుంచి 5%కు తగ్గడంతో ధరలు 5-10% పడిపోతాయి. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు దీని వల్ల లాభం పొందనున్నారు.