కడపకు కొత్త హైవే: రూ.304 కోట్లతో 4 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి

11001చూసినవారు
కడపకు కొత్త హైవే: రూ.304 కోట్లతో 4 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి
కేంద్ర ప్రభుత్వం కడప జిల్లా వాసులకు శుభవార్త అందించింది. కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడను కడప బైపాస్‌తో అనుసంధానించేందుకు రూ.304.44 కోట్ల వ్యయంతో 5.8 కిలోమీటర్ల 4-లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టులో వంతెనలు, అండర్‌పాస్‌లు, ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మాణం ఉంటుంది. దీనివల్ల విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనుసంధానం మెరుగుపడి, సరుకు రవాణా సులభతరం అవుతుంది. కడప నగరంలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్