ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Dec 12, 2025, 04:12 IST/

మద్యం మత్తులో యువకుల హల్చల్.. స్కూల్ బస్సును అడ్డుకుని బాలికను దించాలని!

Dec 12, 2025, 04:12 IST
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. రోడ్డుపై స్కూల్‌ బస్సును ఆపి అందులో ఉన్న ఒక విద్యార్థినిని కిందకు దించాలని డ్రైవర్‌ను బలవంతం చేశారు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో డిసెంబర్‌ 8న ఈ ఘటన జరిగింది. బసవనహళ్లి-వడ్దరహళ్లి రోడ్డులో విద్యార్థులను తీసుకెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డగించి.. అందులో ఉన్న 9వ తరగతి బాలికను బస్సు నుంచి దించాలని డ్రైవర్‌ను బెదిరించారు. తీవ్ర దుర్భాషలాడారు. బస్సు డ్రైవర్‌ రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ SMలో వైరల్‌ అవుతోంది.