కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, అన్ని రంగాల ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్, సకాలంలో జీతం, హెల్త్ చెకప్, మహిళలకు నైట్ షిఫ్ట్ వంటివి తప్పనిసరి. ఫుల్ టైమ్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, టెంపరరీ వర్కర్స్‌కి కూడా పీఎఫ్ వర్తింపజేయాలి. గతంలో ఎక్కువ జీతం ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈఎస్‌ఐసీ కవరేజ్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది.