TG: రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్లారిటీ ఇచ్చారు. మార్చి-ఎప్రిల్ లో కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. తమ ప్రజాబాట కార్యక్రమం ఏప్రిల్ 13న ముగిస్తుందన్నారు. ఈ నాలుగు నెలల పాటు ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటున్నామన్నారు. జాగృతి జనం బాట పొలిటికల్ ఎజెండా కాదని పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తోందన్నారు.