తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ (BCUF) పేరుతో MLC తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీని పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడమే ఈ పార్టీ ముఖ్య లక్ష్యంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సెప్టెంబర్ 17న పార్టీ విధివిధానాలను ప్రకటించి, జెండా ఆవిష్కరణ చేయనున్నారట.