TG: రాష్ట్రంలో ‘జన తెలంగాణ పార్టీ’ పేరిట నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మాజీ మావోయిస్టులు, మాజీ నక్సలైట్లలో కొందరు కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర ప్రధాన పార్టీల్లో ఉన్న అభ్యుదయ, ప్రజాస్వామికవాదులు, పౌరహక్కుల ఉద్యమ నాయకులు ఇందులో భాగం కానున్నారని వినిపిస్తోంది. ప్రజల పక్షాన చిత్తశుద్ధితో పని చేయడం కోసం తాము ఈ కొత్త ప్రయత్నం చేస్తున్నామని పార్టీ ఏర్పాటు కోసం కీలకంగా పనిచేస్తున్న ఓ నేత చెప్పారు. త్వరలోనే ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.