తెలంగాణలో కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన నిరుపేదలకు అక్టోబర్ నుంచి పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దసరా పండుగకు ముందే పింఛన్లు అందించాలని మంత్రి సీతక్క తెలిపారు. క్షేత్ర స్థాయిలో ధరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.