నథింగ్ సంస్థ నుంచి ప్రీమియం హెడ్‌ఫోన్ మోడల్ రానుంది. ఇందులో Triple-Driver సాంకేతికత, 10 మైక్రోఫోన్లతో కూడిన Adaptive ANC, 60 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ మోడల్ సెప్టెంబర్ 29న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. Hi-Res Audio సర్టిఫికేషన్, LDAC సపోర్ట్, Head Trackingతో Spatial Audio వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. Aluminium Body, Scratch-Resistant Glassతో పాటు IP52 రేటింగ్ కూడా ఉంది. యూరప్‌లో సుమారు రూ.38,700, అమెరికాలో రూ.38,000 ధర ఉండొచ్చని అంచనా. అయితే, లాంచ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.