TG: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ
టీడీపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని, నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు వీరిలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార
కాంగ్రెస్, BRS, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.