TG: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించింది. వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్‌లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయనున్నామని, దీని వల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఎండలు తీవ్రతరం అవుతున్న క్రమంలో ఒకేసారి మూడు నెలల రేషన్‌ను లబ్దిదారులకు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్‌ను ఏప్రిల్ నెలలో ఒకేసారి అందిస్తారు.