కొత్త రిజిస్ట్రేషన్లు.. రైతుభరోసాకు మరో 5 రోజులు ఛాన్స్

19చూసినవారు
కొత్త రిజిస్ట్రేషన్లు.. రైతుభరోసాకు మరో 5 రోజులు ఛాన్స్
TG: ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5లోపు రైతు భరోసా(ఎకరానికి రూ.6,000) పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆధార్, పట్టా పాస్‌బుక్, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్, దరఖాస్తు ఫాం నింపి ఏఈవోలకు ఇవ్వాలని చెప్పారు. కాగా మంగళవారం ప్రభుత్వం రైతుభరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్