LPG గ్యాస్ సిలిండర్ డెలివరీలో కొత్త రూల్

157చూసినవారు
LPG గ్యాస్ సిలిండర్ డెలివరీలో కొత్త రూల్
కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్‌పీజీ సరఫరా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు 30 రోజుల్లోగా ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేయడం లేదా ట్రాన్స్‌ఫర్ వోచర్ పొందడం తప్పనిసరి చేసింది. ఒకే ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్, పీఎన్జీ పైప్‌లైన్ గ్యాస్ రెండూ ఉండకూడదని స్పష్టం చేసింది. పీఎన్జీకి మారిన వినియోగదారులకు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వడం లేదా రీఫిల్ చేయడం నిలిపివేయాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పైప్‌లైన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 3 నెలల్లో మార్పు చేయకపోతే ఎల్‌పీజీ సరఫరా నిలిపివేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్