ఏఐ ఆధారిత కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త చర్యలు చేపట్టనుంది. నకిలీ వార్తల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఏఐతో రూపొందిన వీడియోలు, ఆర్టికల్స్‌కు తప్పనిసరిగా “AI Generated” లేబుల్ వేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ఇందుకోసం ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, కంటెంట్ క్రియేటర్లపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.