స్మార్ట్ఫోన్లు, స్మార్ట్టీవీలలో ఇంటర్నెట్ ద్వారా లభించే ఉచిత టీవీ ఛానెళ్ల ప్రసారాలను ప్రత్యేక నియంత్రణ పరిధిలోకి తీసుకురావడానికి ట్రాయ్ (TRAI) కసరత్తు చేస
్తోంది. ఫ్రీ యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ టీవీ (FAST), యాప్ ఆధారిత టీవీ సేవలపై లైసెన్సింగ్ నియంత్రణలు తీసుకురావడంపై ప్రసార శాఖ సూచనలతో చర్చలు జరుగుతున్నాయి. కేబుల్, DTH ఆపరేటర్ల తరహాలోనే సమాన నిబంధనలు తేవాలని చూస్తున్నప్పటికీ, ఉచిత సేవలు వెంటనే ఆగిపోవని ట్రాయ్ స్పష్టం చేసింది.