భారతీయ రైల్వేలు అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ అమలు చేయనున్నాయి. బుకింగ్ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లో ఆధార్ ధృవీకరణ పూర్తి చేసిన ప్రయాణికులకే టికెట్లు లభిస్తాయి. అనంతరం 10 నిమిషాలు ఏజెంట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. అక్రమ సాఫ్ట్‌వేర్ వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు అని అధికారులు తెలిపారు. స్టేషన్ కౌంటర్లలో మాత్రం ఇప్పటి విధానమే కొనసాగనుంది.