అక్టోబర్ 1, 2026 నుంచి కొన్ని కీలకమైన నిబంధనల్లో మార్పులు రానున్నాయి. డోమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు సబ్సిడీపై సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయడం తప్పనిసరి. ఒకే రోజు ఒకే మొత్తంలో చేసే డిపాజిట్లకు అన్ని బ్యాంకుల బ్రాంచుల్లోనూ ఒకే వడ్డీ రేటు వర్తించనుంది. బ్యాంక్ డిపాజిట్ల విషయంలో పారదర్శకత కోసం RBI ఈ రూల్స్ తెచ్చింది. జనన, మరణాలను నిర్ణీత గడువు దాటి రిజిస్టర్ చేసుకునే నిబంధనలు మారాయి. రెండేళ్లకు మించి ఆలస్యమైతే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు అవసరం.