
ఇథియోపియాలో మోదీకి అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లుందని తెలిపారు. ఇథియోపియా సింహాలకు నిలయం. నా స్వస్థలం గుజరాత్ కూడా సింహాలకు నిలయమే. అందుకే నాకు ఇక్కడ ఉంటే సొంతింట్లో ఉన్న భావన కలుగుతోందని అన్నారు. భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఆ దేశానికి స్నేహపూర్వక సోదరభావ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం లభించింది.




