ఇరాన్‌ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్‌.. ఇంటర్నెట్ స్తంభించిపోతుందా?

43చూసినవారు
ఇరాన్‌ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్‌.. ఇంటర్నెట్ స్తంభించిపోతుందా?
ఇరాన్-అమెరికా వివాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు ముప్పును ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి "ఇంటర్నెట్ కేబుళ్లపై రుసుములు విధిస్తాం" అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. ఈ కేబుళ్లపైనే ప్రపంచ ఇంటర్నెట్ ఆధారపడి ఉంది. భారత్‌కి కూడా ఇది కీలకం. ఎందుకంటే అనేక కేబుళ్లు ముంబై, చెన్నై ద్వారా అనుసంధానమై ఉన్నాయి. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే భారతీయ వినియోగదారులపై, రోజువారీ జీవితంపై, బ్యాంకింగ్, ఆన్‌లైన్ విద్య వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్