తెలంగాణలో కొత్త యూనివర్సిటీ.. పనులు ప్రారంభం

9601చూసినవారు
తెలంగాణలో కొత్త యూనివర్సిటీ.. పనులు ప్రారంభం
TG: ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద ప్రతిష్టాత్మక సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పనులకు మోక్షం లభించింది. రూ. 24 కోట్ల వ్యయంతో 8.4 కి.మీ పొడవైన ప్రహరీ గోడ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడతాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్