
అసభ్యకరంగా ప్రవర్తించిన డ్రైవర్.. భయంతో ఆటోలో నుంచి దూకిన యువతి
బిహార్లోని భోజ్పూర్ జిల్లాలో శనివారం కంప్యూటర్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న 19 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, ప్రాణాలను లెక్కచేయకుండా యువతి కదులుతున్న ఆటో నుంచి కిందకు దూకేసింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు 40 ఏళ్ల ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ చౌరాసియా అలియాస్ మాస్టోను అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి. గత పక్షం రోజులుగా బిహార్లో మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.




