
రోసెటో ప్రజల దీర్ఘాయువుకు రహస్యం ఇదే!
అమెరికాలోని రోసెటో పట్టణ ప్రజలు ఎలాంటి అనారోగ్యాలతో చనిపోకుండా, కేవలం వృద్ధాప్యంతోనే మరణిస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. వారి దీర్ఘాయువుకు కారణం మందులు కాదని, బలమైన సామాజిక సంబంధాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఒకరికొకరు తోడుగా ఉండే మనస్తత్వం అని 'రోసెటో ఎఫెక్ట్' ప్రపంచానికి తెలియజేస్తోంది. 1950-60 కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రోసెటోలో 55 ఏళ్ల లోపు వారు ఒక్కరు కూడా గుండెపోటుతో మరణించలేదని డాక్టర్ స్టీవర్ట్ వోల్ఫ్ గుర్తించారు.




