
కొత్త లేబర్ కోడ్స్.. వారానికి 3 రోజుల వీకాఫ్పై క్లారిటీ
కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కొత్త లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వారానికి 4 రోజుల పని దినాలపై కార్మిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. 4 రోజులు పని చేసి 3 వీకాఫ్‌లు కావాలంటే రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుందని, వారానికి మొత్తం పని గంటలు 48గానే ఉంటాయని స్పష్టం చేసింది. 12 గంటల కంటే ఎక్కువ పని చేస్తే ఓవర్‌టైమ్ జీతం డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.




