భారత్ తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టీంఇండియా నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలోనే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచులో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచేల్ (131*) సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1 తో సమం అయింది.