పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఓ నవ వధువు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటు చేసుకుంది. బాగోడా ప్రాంతంలో బంధువుల పెళ్లి వేడుకలో 22 ఏళ్ల నవవధువు దీపిక డీజే పాటలకు డాన్స్ వేసింది. ఈ క్రమంలో ఒక్కసారికగా ఆమె కుప్పకూలి చనిపోయింది. గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాలుగు నెలల క్రితమే దీపికకు వివాహమైంది. అప్పటిదాకా సంతోషంగా గడిపిన దీపిక మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.