TG: పెళ్లైన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన కండెల రోహిత్‌కు, వసంత(21)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఇటీవల భర్త రోహిత్ అతని తల్లి తండ్రులు కలిసి వసంతను వేధించారు. దీంతో వసంత ఈ నెల 1న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు.