అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి

117చూసినవారు
అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి
AP: కర్నూలు జిల్లా కోసిగి మండలంలో నాగమ్మ అనే నవవధువు అనుమానాస్పద స్థితిలో పొలం బావిలో పడి మృతి చెందింది. భర్త నరసింహులుకు అన్నం తీసుకెళ్లిన ఆమె, పొలానికి నీళ్లు తెస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో భర్త వెతకగా, బావిలో బిందెలు కనిపించాయి. చుట్టుపక్కల వారి సహాయంతో వెతకగా, ఆమె మృతదేహం నీటిలో తేలింది. కాలు జారి ప్రమాదవశాత్తు పడి చనిపోయిందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.