పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 368 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని, అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.