త్వరలో పోస్టల్‌లో నెక్ట్స్‌డే డెలివరీ

36చూసినవారు
త్వరలో పోస్టల్‌లో నెక్ట్స్‌డే డెలివరీ
రిజిస్టర్‌ పోస్ట్‌కు స్వస్తి పలికి స్పీడ్‌ పోస్ట్‌కు మారిన తపాలా శాఖ, ఇప్పుడు ఇ-కామర్స్‌ తరహాలో నెక్ట్స్‌డే డెలివరీ సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. తపాలా ద్వారా ఏదైనా ఉత్తరం లేదా పార్శిల్‌ను స్పీడ్‌ పోస్ట్‌ చేస్తే 3-5 రోజులు పడుతోంది. ఇకపై 24 గంటలు, 48 గంటల్లోగా ఉత్తరాలను, పార్సిళ్లను గ్యారెంటీ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్