
రూ.10 వేలు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం జాగ్రత్తగా వేయండి: ప్రియాంక గాంధీ
బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్లను కొనేందుకు రూ.10 వేల చొప్పున పంచుతున్నారని ఆరోపించారు. ‘‘డబ్బులు తీసుకోండి. కానీ ఓటును మాత్రం అమ్ముకోవద్దు. జాగ్రత్తగా వేయండి. బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు, ఢిల్లీ నుంచి నడిచే సింగిల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే. నిరుద్యోగం, వలసలపై మోదీ, నితీశ్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి" అని విమర్శించారు.




