NHAI అదిరిపోయే ఆఫర్.. టాయిలెట్లపై ఫిర్యాదుకు రూ.1,000

79చూసినవారు
NHAI అదిరిపోయే ఆఫర్.. టాయిలెట్లపై ఫిర్యాదుకు రూ.1,000
వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. టోల్ ప్లాజాల్లోని అపరిశుభ్రమైన టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే, వారి ఫాస్టాగ్ అకౌంట్‌లోకి రూ.1,000 రివార్డ్ జమ చేయబడుతుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు 'రాజమార్గ్ యాత్ర' యాప్‌లో టైమ్ స్టాంప్‌తో పాటు అపరిశుభ్రమైన టాయిలెట్ల ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి ఈ రివార్డు లభిస్తుంది. NHAI నిర్వహించే టాయిలెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్